NTV Telugu Site icon

Allari Naresh: అన్నా.. మరీ నువ్వలా భయపెట్టకే.. ‘నేను’ సినిమా గుర్తొస్తుంది

Naresh

Naresh

Allari Naresh: అల్లరి నరేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టి కామెడీ హీరోగా మారాడు. ఇక మధ్య మధ్యలో ఆయన తనలోని విలనిజాన్ని కూడా చూపించాడు. అల్లరి నరేష్.. హీరోగా, విలన్ గా నటించిన చిత్రం నేను. అందులో నరేష్ పాత్రను చూస్తే భయపడకుండా ఉండలేం. ఒక సైకో లవర్ గా అల్లరి నరేష్ పాత్ర ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక అదే సినిమాను గుర్తుచేస్తోంది ప్రస్తుతం అల్లరోడు నటిస్తున్న ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ లో నరేష్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. నిజాయితీగా డ్యూటీ చేయడం వలన కుటుంబాన్ని పోగోట్టుకున్న ఒక పోలీసాఫీసర్.. విలన్స్ పై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది కథగా తెలుస్తోంది.

Subi Suresh: ప్రముఖ యాంకర్ కమ్ నటి మృతి

ఇక ఇక్కడవరకు బాగానే ఉన్నా.. సినిమాలో నరేష్ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించాడు. పోలీసాఫీసర్ లుక్ లో మీసకట్టు, హెయిర్ తో కనిపించిన నరేష్.. పగ తీర్చుకున్నప్పుడు మాత్రం ఫుల్ హెయిర్ కట్ తో కనిపించాడు. టీజర్ ఈవెంట్ లో కూడా నరేష్ ఆ లుక్ తోనే కనిపించాడు. అదే లుక్ నేను సినిమాలో కనిపిస్తుంది. దీంతో నేను లో లానే నరేష్ భయపెడతాడా..? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అప్పటి ఫోటోలను ఇప్పటి ఫోటోలను పక్క పక్కన పెట్టి అన్నా.. మరీ నువ్వలా భయపెట్టకే.. ‘నేను’ సినిమా గుర్తొస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నాంది సినిమాతో మంచి హిట్ ను అందుకున్న నరేష్.. ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments