ఈ ఏడాది ‘నాంది’తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్ హీరోగా ‘తిమ్మరుసు’తో సక్సెస్ సాధించిన ఈస్ట్ కోస్ట్
ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సభకు నమస్కారం’. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా
పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగా
ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావు
కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ
దర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర దర్శకుడు సతీశ్
మల్లంపాటికి అందించారు. నరేశ్ 58వ చిత్రమిది. ఆయన పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్‌లుక్
పోస్టర్‌కు చక్కటి స్పందన లభించింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ఛోటా కె.నాయుడు
సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఇతర
నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ చెబుతోంది.
అల్లరి నరేశ్ ‘సభకు నమస్కారం’ ప్రారంభం
