Site icon NTV Telugu

Allari Naresh: అలాంటి పాత్ర చేయడం నా కల..

Naresh

Naresh

Allari Naresh: నాంది సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నరేష్ గా మారాడు. ఇక ఆ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాలో నటించాడు. నాంది లాంటి హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5 న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా ఉగ్రం సినిమా యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నరేష్ మాట్లాడుతూ.. “20ఏళ్ళగా కామెడీ జోనర్‌లో నటించడంతో కొంత మొహం మొత్తింది. మహర్షి చిత్రం తర్వాత సీరియస్‌ పాత్రలు రావడం మొదలుపెట్టాయి. నాంది కూడా కొత్తగా ట్రై చేద్దామని చేశాను. ఆ చిత్రానికి, తన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

Pooja Bhalekar: ఆ యాంగిల్స్ ఏంటి .. ఆ చూపించడం ఏంటి .. కుర్రాళ్ళు ఆగగలరా..?

నాంది తర్వాత అల్లరి నరేష్‌ని కాస్తా నాంది నరేష్‌గా మారాడు. ఇప్పుడు ఉగ్రం నరేష్ అంటారు. ఉగ్రం కథ విషయానికొస్తే కోవిడ్‌ సమయంలో లక్షా 60వేల మంది కనిపించకుండాపోతారు. అందులో సగం మంది వివరాలు మాత్రమే తెలుస్తాయి.. మిగిలిన వారు ఏమయ్యారన్న కధాంశంతో ఉగ్రం తెరకెక్కింది. బ్లేడ్‌ బాబ్జి, కత్తికాంతారావు లాంటి సినిమాల్లో కామెడీ పోలీసుగా నటించాను.. కానీ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఎలా ఉంటాడో అలా నటించా. 2002 మే 10న నా తొలిచిత్ర అల్లరి రిలీజ్ అయ్యింది.. ఉగ్రం 60వ సినిమా. సినిమాల పరంగా ఇది నా షష్టిపూర్తి. ఇక నా తరువాత సినిమా కామెడీ జోనర్ లోనే ఉంటుంది. నాకు ఇంగ్లిష్ జోకర్ పాత్ర చేయాలని కల. నాంది నుండి సామాజిక బాధ్యతతో సందేశాత్మక చిత్రాలలో నటిస్తున్నాను. కామెడీ చేయగల నటుడు ఎలాంటి పాత్రను అయినా చేయగలుగుతాడు. వాస్తవిక ఘటనలతో ఉగ్రం చిత్రాన్ని తెరకెక్కించాం. తప్పకుండా థియేటర్ లో చూసి ఆదరించండి ” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version