Saagara Sangamam: 4 దశాబ్దాల సాగర సంగమం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కే.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం “సాగర సంగమం”. ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “సలంగై ఒలి”, మలయాళంలో “ సాగర సంగమం”గా ఒకే రోజు విడుదలయ్యాయి. అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది. నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు. శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం, “సాగర సంగమం”.

Also Read
- Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
- Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
- Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
- Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13వ స్థానం దక్కించుకుంది . అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది. ఇక ఇళయరాజా సంగీతం … ఈ చిత్రానికి ఓ హై లైట్.

ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది . అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కి ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు . జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు.

కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి . అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు , శరత్‌బాబు, ఎస్.పి.శైలజల నటన, ఈ చిత్రానికి మరో ప్రత్యేకత . సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART” అని వస్తుంది.
తాజావార్తలు
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
-
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
-
Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!