Site icon NTV Telugu

Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీకి అంతా రెడీ…

Thalapathy Vijay

Thalapathy Vijay

తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత… లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో నటనతోపాటు సేవా కార్యక్రమాలతో విజయ్‌ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

Read Also: Filmfare Awards 2024: జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!

ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్‌లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. దీంతో అతి త్వరలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చేస్తున్న విజయ్… కార్తిక్ సుబ్బరాజ్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తే… సినిమాలకు గుడ్ బై చెప్తాడా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. మరి విజయ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Read Also: Fighter: 14వ సారి 100 కోట్ల క్లబ్‌లోకి హృతిక్ రోషన్.. లిస్ట్ ఇదే!

Exit mobile version