Site icon NTV Telugu

Raviteja: ది ఈగల్ ఈజ్ కమింగ్…

Egale

Egale

ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య… ఈ సినిమాలతో గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో నిలబడ్డాడు మాస్ మహా రాజా రవితేజ. ఆరులో నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టిన రవితేజకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ… 2024 సంక్రాంతి ఈగల్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈగల్ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈగల్ సినిమాలో రవితేజ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడని సమాచారం. 

సంక్రాంతి బరిలో నిలుస్తూ జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈగల్ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ షురూ చేసారు. ఈగల్ మూవీ టీజర్ తో ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇవ్వాలని చూస్తున్న మేకర్స్… రేపు ఉదయం 10:44 నిమిషాలకి ఈగల్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోని ఈగల్ సినిమాపై అందరి దృష్టి పడేలా చేయాలి లేదంటే కలెక్షన్స్ లో కోత పడడం ఖాయం. ఎందుకంటే ఈగల్ సినిమా రిలీజ్ అయ్యే ఒక్క రోజు ముందే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే మిగిలిన సినిమాలకి కలెక్షన్స్ రావాలి అంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. మరి జనవరి 13న ఈగల్ సినిమా రవితేజ కెరీర్ లో ఎలాంటి మైల్ స్టోన్ సెట్ చేస్తుందో చూడాలి. 

Exit mobile version