NTV Telugu Site icon

Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!

Vijay Leo

Vijay Leo

Court Stay Cleared for Leo Movie Telugu Release: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిన క్రమంలో చివరి నిముషంలో షాక్ తగిలినట్టు అయింది. ఒక పక్క సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుండగా హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు లియో తెలుగు రిలీజ్ విషయంలో నిన్న షాకిచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 20 వరకు రిలీజ్ చేయోద్దంటూ ఉత్తర్వులు జారీ చేయగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అనుకున్నారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌ను ఉపయోగించడంపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాత నాగ వంశీ మీద గతంలో ఈ సినిమా టైటిల్ ను తెలుగులో రిజిస్టర్ చేసుకున్న ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Martin Luther King Trailer: నవ్విస్తూనే ఏడిపిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’.. ట్రైలర్ చూశారా?

ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి వారితో మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది. ఈ లియో టైటిల్ విషయంలో రెండు పార్టీలు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవడంతో ఈ స్టే కొట్టివేస్తున్నామని కోర్టు వెల్లడించింది. ఇక ఈ సెటిల్మెంట్ కోసం సితార నాగవంశీ 25 లక్షలు వెచ్చించినట్టు వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి విజయ్ తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా ఈ సినిమాకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అన్నమాట.