ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. పైగా గ్లామరస్ మల్టీ స్టారర్ ప్రకటించాడు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ లాంటి ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్స్ కొనసాగుతోన్న ఆలియా, కత్రీనా కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
‘జీ లే జరా’ సినిమాని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ తో టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనుంది. ఫర్హాన్ అఖ్తర్ ఇరవై ఏళ్ల క్రితం ఆమీర్, సైఫ్, అక్షయ్ ఖన్నాతో ‘దిల్ చాహ్ తా హై’ మల్టీ స్టారర్ రూపొందించాడు. జూనియర్ అఖ్తర్ కి అదే డెబ్యూ మూవీ కూడా. అయితే, రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ‘దిల్ చాహ్ తా హై’ విడుదల రోజునే మన టాలెంటెడ్ డైరెక్టర్ ఇంకో రోడ్ ట్రిప్ మల్టీ స్టారర్ ని ప్రకటించటం ఫ్యాన్స్ ని సూపర్ గా ఎగ్జైట్ చేసింది. పైగా ఈసారి ముగ్గురు హీరోలు కాకుండా ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఒక్క చోట చేరటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. చూడాలి మరి, ‘జీ లే జరా’ బాక్సాపీస్ వద్దకి ఎప్పటికి చేరుకుంటుందో!
