Site icon NTV Telugu

బన్సాలీకి ‘గంగూభాయ్’ బంపర్ ఆఫర్!

ALIYA SLB

బాలీవుడ్ లోని హాట్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో సంజయ్ లీలా బన్సాలీ మొదటి వరుసలో ఉంటాడు. ఆయన సినిమాలో ఆఫర్ కోసం అప్ కమింగ్ ఆర్టిస్టులే కాదు అగ్రశ్రేణి తారలు కూడా తహతహలాడుతుంటారు. మరి ఆలియా ఇందుకు మినహాయింపు ఎందుకవుతుంది? ఆమె బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘హీరా మండీ’లో ఏదో ఒక క్యారెక్టర్ తనకు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం బీ-టౌన్ లో ఆలియా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా పాత్ర కావాలని అడిగింది. అంతే కాదు, బన్సాలీకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ‘హీరా మండి’లో తనకు ఏ పాత్ర ఇచ్చినా సరే ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోనని ఆలియా అంటోంది. అయితే, సంజయ్ లీలా బన్సాలీ ఫ్రీగా ఏం వద్దుకానీ మార్కెట్ ప్రైస్ తోనే మంచి రోల్ ఆఫర్ చేస్తానంటున్నాడు!

‘హీరా మండి’లో ‘గంగూభాయ్’కి ఆల్రెడీ క్యారెక్టర్ కన్ ఫార్మ్ అయిపోయింది. అంతే కాదు, ఆలియా ఎగ్జైట్మెంట్లో డబ్బులొద్దన్నా ఫుల్ రెమ్యూనరేషన్ ఇస్తాననే చెబుతున్నాడు సంజయ్. ఎందుకంటే, ‘హీరా మండి’ నిర్మిస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. మరిక డబ్బుకు కొదవేముంటుంది? ఒకప్పుడు ‘బ్లాక్’ సినిమా తీసిన వేళ బన్సాలీ కోసం బచ్చన్ సాబ్ ఫ్రీగా నటించాడు. ఆయనకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది ఆ సినిమా. కాకపోతే, ‘బ్లాక్’ సినిమా నిర్మాతలు ఆనాటి కాలంలో అమితాబ్ కి రెమ్యూనరేషన్ ఇచ్చుకునే రేంజ్లో లేరట. అందుకే, బిగ్ బి బిగ్ హార్ట్ తో ఫ్రీగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు కష్టం స్టార్ డైరెక్టర్ బన్సాలీ ఎందుకుంటుంది? ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఆయన ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాతో త్వరలో థియేటర్స్ కు రానున్నాడు. ‘గంగూభాయ్’గా ఆలియా నటించిన సంగతి తెలిసిందే!

సంజయ్ దర్శకత్వంలో ఒక పూర్తి స్థాయి సినిమా చేసిన ఆలియా భట్ ‘హీరా మండి’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో పాత్ర కోసం అల్లాడిపోవటం ఆశ్చర్యకరమే! కాకపోతే, బన్సాలీ ప్రాజెక్ట్స్ పట్ల ముంబైలో క్రేజ్ అలా ఉంటుంది మరి!

Exit mobile version