Site icon NTV Telugu

Alipiriki Allantha Dooramlo Trailer: ఏడుకొండల స్వామి డబ్బు తిన్నవాడు ఎవడు బాగుపడడు

Alipiri

Alipiri

Alipiriki Allantha Dooramlo Trailer: నూతన నటుడు రావణ్ నిట్టూర్, శ్రీ నికిత జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. క్యాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బుగొట్టు మరియు రెడ్డి రాజేంద్ర పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టే తెలిసిపోతుంది ఈ సినిమా అంతా తిరుపతి చుట్టూ పక్కల ప్రాంతోలలోనే తీసారని.. ఇక కథ విషయానికొస్తే.. చదువు, డబ్బు లేని ఒక యువకుడు గుడి వద్ద స్వామివారి పాఠాలను అమ్ముకుంటూ ఉంటాడు.. అతనికి ఆ జీవితం నచ్చదు.. ఈ క్రమంలోనే హీరోయిన్ అతడి ప్రేమలో పడుతోంది.

దరిద్రంతో నిండిపోయిన అతడి జీవితంలో అమ్మాయి ప్రేమే అదృష్టంగా భావిస్తాడు హీరో.. అంతలోనే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడం, ఆమె దూరం అవ్వడం, వాళ్ళ నాన్న డబ్బులేదని యువకుడును హేళన చేసి వెళ్లపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఏడుకొండల స్వామికి కానుకగా వేయాలన్న డబ్బును దొంగిలిస్తారు. ఆ డబ్బు ఒక మాఫియా కింగ్ ది కావడంతో కథ అడ్డం తిరుగుతోంది. అసలు ఆ డబ్బు ఎవరిది..? దొంగతనంచేసిన డబ్బు చేతులు ఎలా మారింది. చివరికి ఈ ప్రేమ జంట కలిశారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. అలిపిరికి అల్లంత దూరంలో’ చిత్రాన్ని నవంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version