NTV Telugu Site icon

Alia Bhatt : డేర్ చేస్తున్న అలియా భట్.. తేడా వస్తే అంతే

Aliya Bhatt

Aliya Bhatt

బాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఆలియా కెరీర్‌లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగుభాయ్ కతియావాడీ, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి అయినా, పాప పుట్టినా కూడా కెరీర్‌ను బ్రహ్మండంగా మార్చుకోవచ్చునని ఫ్రూవ్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ.

ఇప్పుడు కేన్స్ ఉత్సవాల్లో మెరవనుంది అలియా భట్. ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పై తొలి అడుగులు వేయబోతుంది ఆలియా. మే 13 నుండి 24 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన జిగ్రా అంతగా ఆకట్టుకోకపోయినా అక్కడితో ఆగిపోలేదు ఆలియా. మరోసారి లేడీ ఓరియెంట్ చిత్రంతో రాబోతుంది. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో ఫస్ట్ టైం తెరకెక్కబోతున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆల్ఫాలో నటిస్తోంది. ముంజా బ్యూటీ శర్వారీ మరో హీరోయిన్. స్పై ఫిల్మ్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే కాకుండా భర్తతో కలిసి లవ్ అండ్ వార్‌లో నటిస్తోంది. అలాగే ఆల్ఫా తో డేర్ చేసి ఎక్స్పీరిమెంట్  చేస్తోన్న అలియా, గత చిత్రాలైన రాజీ, గంగుభాయ్ కతియావాడీలా రెండొందల కోట్ల క్లబ్‌లోకి చేర్చుతుందో జిగ్రాలా ఫట్ మంటుందో చూడాలి.