NTV Telugu Site icon

Alia Bhatt: అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను మర్చిపోవడం కష్టం

Alia

Alia

Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 93. గత కొన్నాళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక తాతయ్య మరణంతో అలియా భట్ కృంగిపోయింది. ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

ఆమె తాతయ్య ఉన్న వీడియోలను షేర్ చేస్తూ.. ” మా తాతయ్య. నా హీరో.. 93 వయస్సు వరకు గోల్ఫ్ ఆడాడు. ఈ వయస్సులో కూడా పనిచేశారు. నాకు బెస్ట్ ఆమ్లెట్ తయారు చేసి ఇచ్చారు. ఎన్నో మంచి కథలను చెప్పారు. వయోలిన్ నేర్పించారు. తన ముని మనవరాలితో ఆదుకున్నారు. మీరు క్రికెట్ ఆడే విధానం, మీరు వేసే స్కెచ్ లు.. మీరు కుటుంబం కోసం ఎంతో తాపత్రయపడేవారు.. చివరివరకు కుటుంబాన్నీ ప్రేమించారు. నాకు ఒకపక్క దుఃఖంగా ఉన్నా ఇంకోపక్క ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించడం కోసమే.. ఆయన నాకు వెలుగును అందించారు.. ఆయన దగ్గర పెరిగినందుకు నేను ఆశీర్వాదంగా మరియు కృతజ్ఞతగా భావిస్తున్నాను.. మళ్లీ మనం కలుకొనేవరకు నేను వాటిని భద్రంగా చూసుకుంటాను ” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే అలియా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె నిర్మాతగా ఎదిగేందుకు కృషి చేస్తోంది.. త్వరలోనే ఆమె నిర్మించే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Show comments