Site icon NTV Telugu

Alia Bhatt: మొట్ట మొదటిసారి బేబీ బంప్ తో అలియా.. ఫొటోస్ వైరల్

Alia

Alia

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే డార్లింగ్స్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది. రణబీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్దమవుతున్న వేళ అలియా కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం విదితమే. అయినా కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా భర్తతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం. ఆమె గర్భవతి అని తెల్సినప్పటినుంచి కూడా షూటింగ్స్ లో పాల్గొంటూనే వస్తోంది. ఈ విషయం గురించి అడిగితే.. తనకు సామర్థ్యం ఉందని, ఏదైనా జరిగితే తన వైద్యులు చెప్పినప్పుడు రెస్ట్ తీసుకొంటానని చెప్పుకొచ్చింది.

ఇక చెప్పినట్టుగానే ఒకపక్క షూటింగ్స్ లో ఇంకోపక్క ప్రమోషన్స్ లో బిజీగా మారింది. ఇప్పటివరకు అలియా తన బేబీ బంప్ ను దాస్తూనే వచ్చింది. ఇక ఎట్టకేలకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో అలియా బేబీ బంప్ తో కనిపించింది. పింక్ కలర్ టాప్ లో అలియా బేబీ బంప్ తో ఎంతో అందంగా ఉంది. ప్రస్తుతం ఈ కపుల్స్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇప్పుడైనా అలియా రెస్ట్ తీసుకొంటుందేమో చూడాలి అంటున్నారు నెటిజన్లు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా బాలీవుడ్ భవిష్యత్తును ఏమైనా మారుస్తుందా..? లేదా..? అనేది తెలియాలి.

Exit mobile version