బాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ, తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ, మరోవైపు కుటుంబానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను సవ్యంగా మేనేజ్ చేస్తున్నారు. ఆమె కుమార్తె రాహా గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకునే అలియాకు, ఇప్పుడు సినిమాల జానర్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. !
‘‘ఇప్పటి వరకు నేను రాహా చూసి ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదు. అందుకే, ఇకపై తాను చూసి నవ్వుకునే సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నా. ముఖ్యంగా కామెడీ కథలను ఎంచుకోవాలని ఉంది. హాస్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా నా కుమార్తె కారణం. కొన్ని ప్రాజెక్ట్‌లను అంగీకరించాను, కానీ వాటి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’’ అని అలియా తెలిపారు. తన భర్త రణ్‌బీర్ కపూర్ తో కలిసి నటించిన ‘లవ్ & వార్’ చిత్రీకరణలో, రాహాను చూసుకోవడం సవాలుగా మారిన సందర్భాలను అలియా షేర్ చేశారు. ‘‘మేము షూటింగ్ ఎక్కువగా రాత్రి సమయాల్లో చేసాము. పగలు రాహాతో గడిపాము, రాత్రి షూట్‌కు హాజరయ్యాం. సెట్‌లో రాహా వచ్చినప్పుడు మాతో కలిసి గేమ్స్, మజాకా చేసేది’’ అని చెప్పారు. అంటే అలియా నిర్ణయం ప్రకారం, తన తరువాతి సినిమాలు రాహా కోసం నవ్వుతూ చూడదగినవి, కామెడీ ప్రధానంగా ఉంటాయి. చిన్నారి కోసం చేసిన ఈ ప్రత్యేక జానర్ మార్పు, ఆమె ఫ్యాన్స్‌ను కూడా ఆహ్లాదపరుస్తుంది.
