Alia Bhatt: సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారి పిల్లలను చూడడానికి, వారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక ప్రేక్షకుల మనసులను తెలుసుకున్న ఫొటోగ్రాఫర్లు ఎలా అయినా వారి ఫోటోలను సంపాదించి క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కొంతమంది లైక్స్, షేర్స్ కోసం రిస్క్ లు చేసి మరీ ప్రముఖుల ఇంటి గుట్టును బయటపెడుతూ ఉంటారు. గతంలో విరుష్క కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు ఇంట్లోకి చొరబడిన విషయం తెల్సిందే. తమకు ప్రైవసీ కావాలని అనుష్క వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని బాలీవుడ్ జంట రణబీర్- అలియా ఎదుర్కొంటున్నారు.
Akhil Akkineni: అయ్యగారు.. లవ్ మిషన్ మొదలుపెట్టారు.. ఇక అరుపులే
రణబీర్ కపూర్- అలియా భట్ గతేడాది పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లి అయిన నెలకే అలియా ప్రెగ్నెంట్ అని షాక్ ఇచ్చింది. ఇక గతేడాదిచివర్లో అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పేరు రహా కపూర్. ఇప్పటివరకు ఆమె ముఖాన్ని అభిమానులకు చూపించింది లేదు. ఇప్పట్లో చూపిస్తారన్న నమ్మకం లేదు అనుకున్నారో ఏమో ఇద్దరు ఫొటోగ్రాఫర్లు అలియా ఇంట్లోకి సీక్రెట్ కెమెరాను పెట్టేసారు. ఆ విషయాన్ని అలియా గమనించడం, వారికి షాక్ ఇవ్వడం రెండు జరిగిపోయాయి. ఈ ఘటనపై అలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “నేను ఎంతో అద్భుతంగా మధ్యాహ్న సమయంలో ఇంట్లో గడుపుతున్నాను. ఆ సమయంలో నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించి మొత్తం పరిశీలించి షాక్ అయ్యాను.. మా పక్కింటి టెర్రస్ పై ఇద్దరు వ్యక్తులు చేతిలో కెమెరాలు పట్టుకొని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఇది మా ప్రైవసీకి భంగం కలిగించడమే.. ఇక చాలు.. మీరు లిమిట్ క్రాస్ చేశారు.. నా ఇంట్లోకి కెమెరాలు పెడతారా..?” అంటూ చెప్పుకొస్తూ ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.