Site icon NTV Telugu

Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!

Alekhya Harika

Alekhya Harika

Alekha Harika Movie with Santosh Shobhan: అలేఖ్య హారిక అంటే తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి అలేఖ్య హారిక అనే పేరు కంటే దేత్తడి హారిక అనే పేరుతోనే ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకున్న ఆమె ఏకంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ లో పాల్గొనడమే కాదు మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న ఆమె ఏకంగా టాప్ ఫైవ్ కంటెండర్స్ లో ఒకరిగా నిలబడింది. ఆమెకు బిగ్ బాస్ కప్ కూడా వస్తుందేమో అని అందరూ అనుకున్నారు కానీ చివరికి ఆమెకు ఆ అవకాశం అయితే దక్కలేదు కానీ మంచి గుర్తింపు అయితే దక్కింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమె హీరోయిన్గా మారుతుంది మంచి సినీ అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.

Rohit Sharma: మూడు రికార్డులకు ఒక్క అడుగు దూరంలో హిట్ మ్యాన్.. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ లో సాధించేనా..!

కానీ అది ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. బిగ్ బాస్ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆమెకు ఇప్పుడు దశ తిరిగినట్టే కనిపిస్తుంది. ఆమె నక్క తోక తక్కిందో ఏమో తెలియదు కానీ ఒక బంపర్ ఆఫర్ మాత్రం తగిలింది. సంతోష్ శోభన్ హీరోగా బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేష్ నిర్మాతలుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలోనే అలేఖ్య హారిక హీరోయిన్గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ రేపు ఘనంగా జరగబోతోంది. బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి రాజేష్ తాను నిర్మాతగా మారి ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అనూహ్యంగా సంతోష్ శోభన్ అలేఖ్య హారికలు ఇద్దరితో కలిసి సినిమా చేస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమా అయినా ఆమెకు కెరియర్లో ప్లస్ అవుతుందేమో చూడాలి.

Exit mobile version