Site icon NTV Telugu

Taraka Ratna – Alekhya : తారకరత్న జ్ఞాపకాలతో అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Alakhya Reddy Emotional Post, Nandamuri Taraka Ratna

Alakhya Reddy Emotional Post, Nandamuri Taraka Ratna

తెలుగు సినీ, రాజకీయ రంగంలో తన ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న మరణానికి రెండేళ్లు గడిచాయి. సినీ రంగంలో సంతృప్తికరమైన జీవితాన్ని చూపించిన తారకరత్న, రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నించారు. ఆయన ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సందర్భాలు అందలు అందరూ చూసే ఉంటారు.

Also Read : Prabhu Deva : చిరంజీవి నా ఆదర్శం.. ఆయన వల్లే ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా

అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించిన సందర్భంలో తారకరత్న గుండెపోటు రావడం జరిగింది. వెంటనే కుప్పం ఆసుపత్రికి, ఆ తర్వాత బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విఫలమయ్యాయి, దాదాపు 23 రోజుల పోరాటం తర్వాత 2023 ఫిబ్రవరి 18 శివరాత్రి రోజున తారకరత్న కన్ను మూశారు.

దీంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డికు, పిల్లలకు ఈ నష్టం అత్యంత బాధాకరం. అప్పటి నుండి అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్త జ్ఞాపకాలు, ఆయనతో గడిపిన క్షణాలు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా మహాలయ అమావాస్య సందర్భంగా అలేఖ్య రెడ్డి ప్రత్యేకంగా నందమూరి తారకరత్న కు నివాళి అర్పించారు. ఆమె పోస్టులో ఇలా రాసుకున్నారు.. ‘నా గుండెల్లో భరించలేని బాధ ఉంది. అది ఎన్నటికీ మానిపోదు, నీతో పాటే అన్నీ వెళ్లిపోయాయి. నా మనసుకు బాధ కలిగించే సమయంలో నీ గురించి రాయడానికి ప్రయత్నిస్తాను. రోజులు గడిచే కొద్దీ నిన్ను ఇంకా మిస్ అవుతున్నా. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. అయినా నేను ఎన్నటికీ ఆశను వదులుకోను. ఎందుకంటే నీ గుండె చప్పుడు ఇప్పటికీ నాలో బతికే ఉంది. అది ఎన్నటికీ నిన్ను గుర్తు చేస్తుంది’ అంటే ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

 

Exit mobile version