Site icon NTV Telugu

అల సాక్షి అవార్డ్స్ లో…

Ala Sakshi Awards lo Allu Arjun Team

సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్‌లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ అందుకోగా… థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సాధించాడు.

Read Also : పూజా హెగ్డే డబ్బింగ్ బిగెన్స్

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తన ఆనందాన్ని పంచుకుంటూ పూజా, త్రివిక్రమ్, రాధా కృష్ణ, థమన్ లతో కలిసి ఉన్న పిక్ ను పంచుకున్నారు. ఆ పిక్ కు “అల సాక్షి అవార్డ్స్ లో” అని కామెంట్ చేశాడు. “అల వైకుంఠపురములో” 2020 జనవరి 12 న థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలో ఈ చిత్రం మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” పోటాపోటీగా విడుదలయ్యాయి. “అల వైకుంఠపురములో” మూవీ భారీ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ ఎన్‌ఎక్స్‌టిలో ప్రసారం అవుతోంది.

Exit mobile version