NTV Telugu Site icon

Al Pacino: అల్ పచినో… అసలు కారణమేంటి!?

Al Pachino

Al Pachino

అల్ పచినో పేరు వినగానే ఆయన నటించిన అనేక చిత్రరాజాలు మన మదిలో మెదలుతాయి. ముఖ్యంగా “గాడ్ ఫాదర్, సెర్పికో, డాగ్ డే ఆఫ్టర్ నూన్, డిక్ ట్రేసీ, సెంట్ ఆఫ్ ఏ ఉమన్” వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు. ‘సెంట్ ఆఫ్ ఉమన్’తో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను సొంతం చేసుకున్న అల్ పచినో 83 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా ఉన్నారు. నటించడానికి సై అంటున్నారు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ‘ది ఐరిష్ మేన్’లోనూ పచినో అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా అల్ పచినో ‘అస్సాస్సినేషన్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్ పచినోతో పాటు విగ్గీ మార్టెన్ సన్, జాన్ ట్రవోల్టా వంటి వారు కూడా నటించనుండటం విశేషం!

ఇంతకూ ‘అస్సాస్సినేషన్’ కథ ఏమిటంటే, ఓ నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ హత్య ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో కెన్నడీ హత్య గురించి మరోమారు చర్చించబోతున్నారు. ఈ సారి హత్య చూసిన జనం కోణంలో కథ సాగనుందని తెలుస్తోంది. కెన్నడీని ఇప్పటికీ అభిమానించే వారెందరో అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘అస్సాస్సినేషన్’ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ లో ప్రొడక్షన్ మొదలు కానుంది. 83 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా ఉన్న అల్ పచినో ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నానో త్వరలోనే తెలియజేస్తాననీ అభిమానులకు ఓ హింట్ అందించారు. అదేమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు సినీజనం.

Show comments