Site icon NTV Telugu

అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్‌ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ షూటింగ్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Exit mobile version