NTV Telugu Site icon

Akshay Kumar: భూమి పుట్టక ముందు పుట్టావ్.. అక్షయ్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Akshay

Akshay

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్న విషయం విదితమే.. ఈ పాన్ ఇండియా సినిమా బాలీవుడ్, టాలీవుడ్ మధ్య దూరాన్ని తగ్గించేసాయి.. అక్కడ హీరోలు ఇక్కడకు.. ఇక్కడి హీరోలు అక్కడికి రావడం, పోవడం ఎక్కువై చనువు పెరుగుతోంది. ఇక స్టార్ హీరోలు ఒకరినొకరు అన్నా, తమ్ముడు అని పిలిచుకొనేవరకు వచ్చేశారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఎంత అన్నా, తమ్ముడు అని పిలిచినా వయస్సు చూసుకోవాలి కదా అంటున్నారు అభిమానులు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే.. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తనకన్న చిన్నవాడైన రామ్ చరణ్ ను అన్నా అని పిలవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు.

“ఎంత మంచి ట్రైలర్ అక్షయ్ సర్.. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా మంచి విఅజయ్మ్ సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ చరణ్ ట్వీట్ చేస్తూ ట్రైలర్ ను షేర్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు అక్షయ్ స్పందిస్తూ “థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ అన్నా.. మా పుట్టినరోజు అబ్బాయి ఆనంద్ ఎల్ రాయ్ లానే మా సినిమా రక్షా బంధన్ కూడా హృదయాన్ని హత్తుకొంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ వయసు ఎక్కడ.. చరణ్ వయస్సు ఎక్కడ..? అన్నా అని పిలవడం ఏంటి ..? పిలవాలనుకొంటే తమ్ముడు అని పిలవొచ్చుగా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఏదో చనువు కొద్ది పిలిచి ఉంటాడు. దాన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంకొందరు ఇదంతా ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. ఒక్క సినిమాతోనే చరణ్ అక్కడ అన్న గా మారిపోయాడు.. అది చరణ్ రేంజ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.