NTV Telugu Site icon

Akshay Kumar: రియల్ స్టంట్స్ చేసే ఇద్దరు ఒకటే చోట ఉంటే ఇలానే ఉంటది

Akshay Kumar

Akshay Kumar

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. మిడ్ వీక్ అయినా ఫెస్టివల్ డే కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి బడే మియా చోటే మియా రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ మేకర్స్ బడే మియా, చోటే మియా టీజర్ ని లాంచ్ చేసారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్… యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో ఇంప్రెస్ చేసింది.

పృథ్వీ లుక్ ని కంప్లీట్ గా రివీల్ చేయలేదు కానీ మాస్క్ మ్యాన్ గా ప్రెజెంట్ చేసారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు స్టంట్స్ ని డూపుల్లేకుండా చేస్తారు కాబట్టి కొన్ని చోట్ల రియలిస్టిక్ విజువల్స్ కనిపిస్తాయి. టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ సినిమా చేసిన డైరెక్టర్ కాబట్టి బడే మియా చోటే మియా ప్రాజెక్ట్ లో ఫైట్స్ ఓవర్ ది బోర్డ్ ఉంటాయి. సో ట్రైలర్ తో కూడా ఇదే రేంజ్ ఇంపాక్ట్ ఇస్తే ఈ ఈద్ కి బడే మియా చోటే మియా సినిమాతో టైగర్ అండ్ అక్షయ్ కుమార్ సాలిడ్ హిట్స్ కొట్టేసినట్లే. అయితే ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యి ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడకుండా థియేటర్స్ లోకి వస్తే బడే మియా చోటే మియా సినిమాకి దేవరకి క్లాష్ పడుతుంది.