Site icon NTV Telugu

Akshay Kumar: మూడు రోజుల్లో కేవలం 10 కోట్లు రాబట్టడం ఏంటి సార్?

Selfiee

Selfiee

బాలీవుడ్ బాక్సాఫీస్ కర్ణుడి కష్టాల్లో ఉంది… ఒక్క సినిమా హిట్ అయితే చాలు పది సినిమాలు ఫట్ అవుతున్నాయి. గత అయిదేళ్లుగా ఉన్న ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో ఎండ్ కార్డ్ వేస్తాడని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలని నిజం చేస్తూ పఠాన్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగల్ లాంగ్వేజ్ గ్రాసర్ గా నిలుస్తోంది. నెల రోజులు అయినా పఠాన్ సినిమా బాక్సాఫీస్ జోరు తగ్గనే లేదు. దీంతో పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ ని రివైవ్ చేసేసింది, ఇకపై బాలీవుడ్ కోలుకుంటుంది అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ఆ నమ్మకం ఉత్త అబద్దం అని నిరూపిస్తుంది సెల్ఫీ సినిమా. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలు హీరోగా నటించిన సెల్ఫీ సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయ్యింది కానీ ఎందుకో ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి రాలేదు. దీంతో మొదటి రోజు కేవలం రెండు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి సెల్ఫీ సినిమా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ వేవ్స్ ని సెండ్ చేసింది.

ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా మొదటి రోజు రెండు కోట్లు రాబట్టడం అంటే దాన్ని మించిన డౌన్ ఫాల్ ఉండడు. మొత్తం ఇండస్ట్రీనే ఎఫెక్ట్ చేసే పరిణామం ఇది. సరేలే రీమేక్ కదా నెమ్మదిగా కోలుకుంటుందేమో అనుకుంటే సెల్ఫీ సినిమా ఫస్ట్ వీకెండ్ కి కలెక్ట్ చేసింది పది కోట్లు మాత్రమే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే అక్షయ్ కుమార్ సినిమా ఇలా మూడు రోజుల్లో కేవలం పది కోట్లు రాబట్టడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. సెల్ఫీ రిజల్ట్ చూసిన తర్వాత బాలీవుడ్ పఠాన్ హిట్ మత్తులో నుంచి బయటకి వచ్చి నష్టనివారణ చర్యలని ఇమ్మిడియేట్ గా చేపట్టాలి లేదంటే ట్రేడ్ కోలుకునే అవకాశమే లేదు.

Exit mobile version