దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల ఐదో పోలింగ్ జరుగుతుంది.. ఈరోజు పలు పాంత్రాల్లో ఓటింగ్ మొదలైంది.. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బాలీవుడ్ ప్రముఖులు అంతా తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు వచ్చేసారు.. సామాన్యుల తో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు..
ఐదో దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ తో పాటుగా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్‌లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు..
ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్ , జాన్వీ కపూర్ , రాజ్‌కుమార్ రావ్, ఐరా ఖాన్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, షాహిద్ కపూర్ సహా పలువురు తారలు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.. వారంతా ఫ్యాన్స్ కోరిక మేరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు..ఈ మేరకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్, గతేడాది ఆగస్టు లో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటును వేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..