Site icon NTV Telugu

ఇక్కడ చిరంజీవి… అక్కడ అక్షయ్ కుమార్

Akshay Kumar completes 150 movies

ఒకప్పుడు మన హీరోలు స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసేవారు. దాంతో ఒక్కో హీరో ఖాతాలో వందలాది సినిమాలు ఉంటూ వచ్చాయి. కాలం మారింది. పర్ ఫెక్షన్ పేరుతో ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారింది. దానికనుగుణంగా హీరోల కెరీర్ లో వంద సినిమాలు అనేది ఇంపాజిబుల్ టాస్క్ గా మారింది. ప్రత్యేకించి ఈ తరం హీరోలు వంద మార్క్ కు చేరటం తీరని కలగా మిగిలిపోతోంది. మన స్టార్ హీరోలలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించగా, బాలకృష్ణ ఇటీవల ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో వంద సినిమాలు పూర్తి చేశారు. ఇక నాగార్జున, వెంకటేశ్ ఆ మార్క్ కి కొద్ది దూరంలో ఉన్నారు. ఇక ఈ తరం స్టార్ హీరోలకు వంద సినిమాలు అందని ద్రాక్షనే. ఇక బాలీవుడ్ లో కిలాడీ అక్షయ్ కుమార్ తనదైన ట్యాలెంట్ తో దూసుకుపోతున్నాడు. షారూఖ్, ఆమీర్, సల్మాన్ రాజ్యమేలుతున్నా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటంలో సిద్ధహస్తుడుగా అక్షయ్ పేరు సంపాదించాడు. ఇక తన సినిమాలను సైతం పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో వడివడిగా పూర్తిచేస్తుంటాడు. అందుకే కెరీర్ లో అనతి కాలంలోనే 150 సినిమాల మైలు రాయికి చేరువయ్యాడు. కెరీర్ లో ఖాళీ అనేది లేకుండా ఎప్పుడూ ఏదో ఒకసినిమాతో బిజీగానే ఉంటూ వస్తున్నాడు.

Read Also : ఆగష్టు 15న పవన్, రానా మూవీ సర్ప్రైజ్


1987లో కెరీర్ ప్రారంభించిన అక్షయ్ ఇప్పటికి 146 సినిమాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆగస్టు 19న ‘బెల్ బాటమ్’ రిలీజ్ అవుతోంది. ఇంకా లిస్ట్ లో ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘ఆత్రంగీ రే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలున్నాయి. అయితే 150 సినిమాను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. దానికోసం స్పెషల్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నట్లు టాక్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు పూర్తి చేసి ఇంకా బడా స్టార్ గా కొనసాగుతున్నాడు. అలా బాలీవుడ్ లో కిలాడీ అక్షయ్ కుమార్ కూడా టాప్ రేంజ్ లోనే కొనసాగుతుండటం గమనార్హం. మరి అక్షయ్ ఇలాగే 200 చిత్రాల మైలురాయిని కూడా చేరుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version