Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Akkineni Nageswara Rao Jayanthi Special

Akkineni Nageswara Rao : ‘ట్రాజెడీ కింగ్’ అంటే ఆయనే!

Published Date :September 20, 2022 , 10:32 am
By Subbarao N
Akkineni Nageswara Rao : ‘ట్రాజెడీ కింగ్’ అంటే ఆయనే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు చిత్రసీమలో విషాదాంత ప్రేమకథా చిత్రాలలోనూ నటించి, ఘనవిజయాలు సాధించిన ఘనత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు సొంతం! విషాదాంత ప్రేమకథలు అనగానే “లైలా-మజ్ను, అనార్కలి- సలీమ్, పార్వతి-దేవదాసు” గుర్తుకు వస్తారు. చిత్రమేమిటంటే, ఈ మూడు కథల్లోని ప్రేమికుని పాత్రల్లో నటించి జనాన్నిమెప్పించారు ఏయన్నార్. అందుకే జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలిచారు అక్కినేని. ఆ తరువాత కూడా ట్రాజెడీ రోల్స్ లో నటసమ్రాట్ తనదైన బాణీ పలికించారు.

‘లైలా-మజ్ను’లో “పయనమయే ప్రియతమ… నను మరచిపోకుమా…” పాటలో భగ్నప్రేమికునిగా ఏయన్నార్ అభినయం అలరించింది. అయితే ఆయనను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపిన సినిమా ‘దేవదాసు’ అనే చెప్పాలి. ‘లైలా మజ్ను’ విడుదలైన నాలుగేళ్ళకు ‘దేవదాసు’ వెలుగు చూసింది. అప్పటికే అశేష పాఠకలోకాన్ని అలరించిన ‘దేవదాసు’ నవల చదివిన వారు, ఆ కథతో రూపొందిన హిందీ, బెంగాలీ చిత్రాలు చూసినవారు ‘దేవదాసు’గా అక్కినేని ఆకట్టుకోలేరని అన్నారు. కొందరు ఆ చిత్ర రూపశిల్పులు – వినోదా అధినేతలైన వేదాంతం, డి.యల్, సముద్రాలను ముఖానే విమర్శించారు. దాంతో ‘దేవదాసు’ పాత్రను పండించాలని ఏయన్నార్ లో కసిపెరిగింది. ఆ సినిమాను తన నటజీవితానికే సవాల్ భావించారు. విమర్శకుల నోళ్ళు మూయిస్తూ ‘దేవదాసు’ పాత్రలో జీవించారు అక్కినేని. ఇందులో “జగమే మాయ…”, “కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్…”, “చెలియలేదు… చెలిమి లేదు…” వంటి పాటల్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఏయన్నార్ అభినయించిన తీరు ప్రేక్షకుల కళ్ళలో గంగను పొంగించింది. ‘దేవదాసు’ సినిమా ఏయన్నార్ ను మహానటునిగా నిలపడమే కాదు, బాక్సాఫీస్ వద్ద జయకేతనమూ ఎగరవేసింది.

మరో విషాదాంత ప్రేమకథ ‘అనార్కలి’లో సలీమ్ గానూ ఏయన్నార్ ఒప్పించారు. అప్పటికే హిందీలో తెరకెక్కిన ‘అనార్కలి’ చిత్రం ఛాయల్లోనే ఈ సినిమా తెరకెక్కింది. తెలుగువారి సలీమ్ గా అక్కినేని జేజేలు అందుకున్నారు. “పెళ్ళికానుక, సుమంగళి” చిత్రాల్లోనూ భగ్నప్రేమికునిగా, త్యాగమూర్తిగా ఏయన్నార్ అభినయించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? ‘బాటసారి’లో మౌన ప్రేమికునిగా ఏయన్నార్ తనదైన నటన ప్రదర్శించారు. ‘మూగమనసులు’లోనూ మూగప్రేమను అభినయించి ఆకట్టుకున్నారు. “మనసు మూగదే కానీ, బాసుంటది దానికి…” అంటూ ఆత్రేయ పలికించిన పదాలకు అనువైన అభినయాన్ని తెరపై ఆవిష్కరించారు అక్కినేని.

‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’లో భగ్నప్రేమికునిగా కనిపించినా, ‘రావణుడే రావణుడైతే’లో వలచిన వనితను మరిచే పాత్రలోనూ అక్కినేని అభినయం ఆకట్టుకుంది. చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన నటన కోసమే సినిమాలు చూసిన వారున్నారు. ఇక ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని అభినయవైభవం ఓ చరిత్రగా నిలచింది. విషాదాంత ప్రేమకథతో ‘ప్రేమాభిషేకం’ స్థాయి విజయాన్ని చవిచూసిన చిత్రం మరొకటి కానరాదు. ఇకపై రాదు అని కూడా చెప్పవచ్చు. అలా విషాదాంత గాథలతో మెప్పించిన ఏయన్నార్ ను అభిమానులు ఈ నాటికీ ‘ట్రాజెడీ కింగ్’ అంటూ కీర్తిస్తూనే ఉన్నారు. భావితరాలు సైతం నటసమ్రాట్ నటనా వైభవాన్ని చూసి జేజేలు పలుక కుండా ఉండలేవు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nageswara Rao
  • Akkineni Nageswara Rao Special
  • annapurna studios
  • Dasara Bullodu
  • Tenali Ramakrishna

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions