Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చి టాలీవుడ్ చరిత్రను, యాక్షన్ చిత్రాల రూపురేఖలను పూర్తిగా మార్చేసిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ శివ జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. అక్కడ ‘శివ’ సినిమాకు దక్కిన ఆదరణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సాధారణంగా మన హీరోలకు మన దగ్గర ఎన్నో బిరుదులు ఉంటాయి. కానీ, జపాన్‌లోని నాగార్జున అభిమానులు మాత్రం ఆయనను పిలుస్తున్న పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జపాన్ ప్రేక్షకులు నాగార్జునను ప్రేమగా “లార్డ్ నాగ్”, “నాగ్ సామా” అని పిలుచుకుంటూ ఆరాధిస్తున్నారు. ఒక ఇండియన్ హీరో సినిమాను అక్కడి ప్రజలు ఈ స్థాయిలో ఓన్ చేసుకుని, కొలవడం నిజంగా టాలీవుడ్ స్థాయికి నిదర్శనం.
జపాన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ కల్ట్ చిత్రాన్ని చూసి అక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా చూసిన ఒక జపాన్ అభిమాని స్పందిస్తూ.. “ఈ హీరో స్క్రీన్ మీద ఎంత కూల్‌గా ఉన్నాడో! ఇది నిజంగా అత్యంత ఆసక్తికరమైన చిత్రం” అని కొనియాడారు. మరో అభిమాని అయితే “ఈ సినిమాను రెండోసారి, మూడోసారి, చివరికి నాలుగోసారైనా సరే ఎలాంటి బోర్ కొట్టకుండా చూస్తూనే ఉండగలను” అంటూ తన ప్రేమ వ్యక్తం చేశారు. 37 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా, నేటికీ ఏమాత్రం పాతబడినట్లు అనిపించలేదని, ఇప్పటికీ సరికొత్త అనుభూతిని ఇస్తోందని వారు ప్రశంసల వర్షం కురిపించారు. అంతకుముందు, సినిమాను సరికొత్త హంగులతో రీ-మేక్ చేస్తూ.. 4K డాల్బీ అట్మాస్ ప్రెజెంటేషన్‌లో నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకువచ్చారు. దీనితో నాటి తరం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే, కొత్త తరానికి కూడా ఆ అద్భుతమైన సౌండ్, విజువల్స్ సరికొత్త అనుభూతిని పంచాయి. అక్టోబర్ 5, 1989న విడుదలైన ‘శివ’ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో, ఇప్పుడు సరిగ్గా అదే రేంజ్ వైబ్స్ జపాన్ ప్రేక్షకులను సైతం కట్టిపడేశాయి. ఏ దేశమైనా, ఏ భాషయినా.. మంచి కంటెంట్ ఉంటే సినిమాను ఆదరించడంలో సరిహద్దులు లేవని నాగార్జున మరోసారి నిరూపించారు!
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..