Site icon NTV Telugu

Akkineni Nagarjuna: కొడుకులు స్పందించారు సరే.. మరి తండ్రి సంగతి ఏంటి..?

Nag

Nag

Akkineni Nagarjuna: నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య ఇప్పటివరకు లోలోపల జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు బయటపడింది. అనుకోకుండా జరిగినా నందమూరి బాలకృష్ణ మాట జారారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని- నందమూరి కుటుంబాల మధ్య 1984 నుంచే విబేధాలు ఉన్నాయని, అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా అక్కినేని కుటుంబంపై నందమూరి కుటుంబం అక్కసు వెళ్లగక్కుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మరోసారి నందమూరి బాలకృష్ణ నోటినుంచి ఆ అక్కసు బయటపడిందని చెప్పుకొస్తున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అన్న మాట పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ఈ విషయమై అక్కినేని నట వారసులు స్పందించారు.

అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ పొలైట్ గానే స్పందించారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అంటూ చెప్పుకొచ్చారు. ఘాటుగా స్పందించకపోయినప్పటికీ కనీసం మాట్లాడారు.. కానీ, అక్కినేని నాగార్జున అది కూడా చేయకపోయేసరికి అభిమానులు మండిపడుతున్నారు.నాగార్జున ఎక్కడున్నారు.. దీనిపై ఒక ట్వీట్ అయినా చేయాలి కదా.. అభిమానులం మాకే చాలా అవమానంగా ఉంది.. మీకు ఏమి అనిపించడం లేదా..? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక బాలయ్య మాటలను సీరియస్ గా పట్టించుకోనే అవసరం లేదని నాగ్ అనుకుంటున్నాడేమో అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడైనా నాగ్ కొద్దిగా బయటికి వచ్చి ఈ విషయమై స్పందిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version