Site icon NTV Telugu

Akkineni Nagarjuna : నాగార్జున ఇమేజ్‌కు లీగల్ ప్రొటెక్షన్.. 72 గంటల్లో లింక్స్ తొలగించాలని ఆదేశం

Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరు, ఫోటోలు, వాయిస్‌తో పాటు ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అనధికారికంగా వాడుతున్నారని ఆరోపిస్తూ నాగార్జున ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన వ్యక్తిత్వాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తన గౌరవ, ప్రతిష్టను దెబ్బతీస్తోందని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు నాగార్జునకు లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్‌ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ

కోర్టు ఉత్తర్వుల ప్రకారం, నాగార్జున వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించడం, ముఖ్యంగా అభ్యంతరకర లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌లో చూపించడం నిషేధించబడింది. పిటిషన్‌లో పేర్కొన్న వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ లింక్‌లను 72 గంటలలోగా తొలగించాలని ఇంటర్మీడియరీలకు, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర డిజిటల్ సర్వీసులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం AI దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలకు స్పష్టమైన హెచ్చరికగా మారింది.

దీంతో నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు, అలాగే తన న్యాయవాదుల బృందానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి వారు కూడా ఇలాంటి పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించి అనుకూల తీర్పులు పొందారు. ఇప్పుడు నాగార్జున కు వచ్చిన ఈ తీర్పు దక్షిణాది సినీ తారలకు ఒక కొత్త న్యాయ మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version