Site icon NTV Telugu

Akkineni Naga Chaitanya: బెస్తవాళ్ళు నల్లగా ఉంటారని ఎవరు చెప్పారు.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన చై

Tandel

Tandel

Akkineni Naga Chaitanya:అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు రిలీజ్ అయిన ఫస్ లుక్ లో చై.. మాస్ అవతారంలో కనిపించాడు. ఈ చిత్రంలో బెస్తవాడిగా చై కనిపించనున్నాడు. అయితే.. లుక్ మొత్తం బావుంది కానీ, బెస్తవాడిగా చై సెట్ కాలేదని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్ళు నల్లగా ఉంటారు.. ఇంకా కొంచెం మాస్ లుక్ లో ఉంటారు. కానీ, చై మాత్రం తెల్లగా.. ప్యాంట్ తో క్లాస్ లానే కనిపిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయమై చై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కాకుండా.. దీనికన్నా ముందు చైతన్య దూత వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. అమెజాన్ లో త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దూత ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురయ్యింది.

Mega 156: విశ్వంభర.. సెట్ లో అడుగుపెట్టాడంటరోయ్.. ఇక కాసుకోండి

బెస్తవాళ్ళు నల్లగా ఉంటారు.. మీరేమో తెల్లగా మెరిసిపోతున్నారు అన్న ప్రశ్నకు చై మాట్లాడుతూ.. ” ఏ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు ఈ పాత్ర క్రియేట్ చేశాడో .. ఆ వ్యక్తి నా కంటే తెల్లగా ఉంటాడు. అతన్ని నేను కలిశాను. మాట్లాడాను. కాబట్టి అలాంటి బాధేంలేదు. ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నాం.” అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శ్రీకాకుళం యాస కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version