Site icon NTV Telugu

Akkineni Naga Chaitanya: దూత సిరీస్.. చై ఎట్టకేలకు హిట్ కొట్టాడు.. ?

Dhootha

Dhootha

Akkineni Naga Chaitanya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా అని పరుగులు పెడుతుంది. కుర్రహీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా వెంట పడుతున్నారు. కానీ, అక్కినేని వారసులు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా రేస్ లో అడుగుపెట్టలేదు. అక్కినేని అఖిల్.. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టాలని చూసాడు. కానీ, చివరి నిమిషంలో ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఆగిపోయింది. ఇక అక్కినేని నాగ చైతన్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తున్నాడే కానీ, పాన్ ఇండియా మాత్రమే చేయాలనీ పట్టు పట్టుకు కూర్చోలేదు. ఇక ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెడుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే చై.. దూత అనే వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టాడు. 13 బి, మనం, 24 లాంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్.. దూత సిరీస్ ను తెరకెక్కించాడు.

Animal: యానిమల్ టాక్.. ఏదో తేడాగా ఉందే.. ?

గతరాత్రి నుంచి ఈ సిరీస్.. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది.. ? అనేది చూపిస్తూనే అతీంద్రయ శక్తులను కలుపుతూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసాడు విక్రమ్. ఇక చై తన నటనతో సిరీస్ మొత్తాన్నితన భుజాల మీద మోశాడు అని చెప్పొచ్చు. అవినీతి చేస్తూ.. లంచాలు తీసుకొనే జర్నలిస్ట్ గా కనిపించాడు. విక్రమ్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పాత విక్రమ్ ను మరోసారి చూసినట్లు ఉందని అంటున్నారు. ఇక దూత స్ట్రీమింగ్ అయిన దగ్గరనుంచి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే చై.. హిట్ అందుకున్నట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక తండేల్ కూడా హిట్ అయితే చై స్టార్ హీరో రేస్ లోకి వచ్చినట్టే. మరి తండేల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version