NTV Telugu Site icon

Custody: అక్కినేని కుర్రాడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు…

Custody

Custody

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’.  కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసింది. ‘కానిస్టేబుల్ శివ’గా చైతన్య లుక్ విషయంలో మంచి చేంజ్ ఓవర్ చూపించడంతో, ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమాలో అరవింద స్వామీ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న వెంకట్ ప్రభు, కస్టడీ సినిమాని బైలింగ్వల్ కాప్ డ్రామాగా రూపొందించాడు. ఈ సినిమాతో చైతన్య కోలీవుడ్ కూడా మంచి హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు. అప్పటికే అఖిల్, నాగార్జునలు ఫ్లాప్ ఇవ్వడంతో అక్కినేని అభిమానులు ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే పెట్టుకున్నారు.

అందరికీ షాక్ ఇస్తూ కస్టడీ సినిమా ఊహించని రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో కస్టడీ సినిమాని రెగ్యులర్ మూవీ లవర్స్ అవాయిడ్ చేసారు. దీంతో అక్కినేని ఫామిలీ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. ఈ సినిమా హిట్ అయ్యి ఉంటే చైతన్యకి తమిళనాడులో మంచి మార్కెట్ ఓపెన్ అయ్యేది కానీ అలా జరగలేదు. మే 12న థియేటర్స్ లోకి వచ్చిన కస్టడీ మూవీ, హిట్ అయ్యి ఉంటే కనీసం ఎనిమిది వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రావాల్సిన కస్టడీ సినిమా ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 9న కస్టడీ సినిమా ఓటీటీలోకి వస్తుందంటూ అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాని ఓటీటీలో అయినా రెగ్యులర్ మూవీ లవర్స్ చూసి ఎంజాయ్ చేస్తారేమో చూడాలి.

Show comments