గత కొన్నేళ్లుగా అక్కినేని అభిమానులకు సరైన “సాలిడ్ హిట్” పడలేదనే చెప్పాలి, కింగ్ నాగార్జున ఇతర భాషల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నా, అఖిల్ వెండితెరకు దూరమై మూడేళ్లు కావస్తోంది. నాగచైతన్య ‘తండేల్’తో తన సత్తా చాటి 100 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, అభిమానుల ఆకలి ఇంకా తీరలేదు, 2026 మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు అసలైన ‘ఐ ఫీస్ట్’ కాబోతోంది. వేర్వేరు జోనర్లలో ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు, అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ వినిపిస్తోంది, ఈ మైల్‌స్టోన్ సినిమాలో నాగచైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రల్లో మెరిసే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ముగ్గురు అక్కినేని హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడటం అభిమానులకు అతిపెద్ద పండగ అని చెప్పాలి.
Also Read:Spirit: 2027 సంక్రాంతికి కాదు.. అఫిషియల్ రిలీజ్ డేట్ చెప్పేసిన వంగా
‘తండేల్’ సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న నాగచైతన్య, ఈసారి తన రూటు మార్చాడు, రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ‘వృషకర్మ’ అనే మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కథలో ఉండే సస్పెన్స్, చైతూ మేకోవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి, వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో చైతూ చూపిస్తున్న పరిణతి ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లనుందని సమాచారం. అలాగే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అఖిల్ అక్కినేని ఒక పక్కా లోకల్ అండ్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు, ‘లెనిన్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఒక రూరల్ యాక్షన్ డ్రామా. ఇప్పటివరకు స్టైలిష్ లుక్స్‌లో కనిపించిన అఖిల్, ఈ సినిమాలో మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నాడు, గత చిత్రాల పరాజయాలను పక్కన పెట్టి, ఈ సినిమాతో ఒక బలమైన కమ్ బ్యాక్ ఇవ్వాలని అఖిల్ పట్టుదలతో ఉన్నాడు.
