Akkineni Akhil Movie fixed with Anil Kumar Upadyayula: అక్కినేని నాగచైతన్య తర్వాత ఆ కుటుంబాన్ని నుంచి మరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒకటి కూడా అందుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత పర్వాలేదు అనిపించినా సరే తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమాతో మరోసారి దారుణమైన ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆయన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక సినిమా, uv క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అని ప్రచారమే తప్ప ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Hanuman: భజరంగీతో హనుమాన్.. తేజ.. ఏం అదృష్టమయ్యా నీది..
అయితే తాజాగా uv క్రియేషన్స్ బ్యానర్ మీద ఆయన సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా యూవి క్రియేషన్స్ బ్యానర్ మీద విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్టర్ గా జరిగేకుతున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టైటిల్ వీడియో అని ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఆ వీడియో సిద్ధం చేసిన వ్యక్తి పేరు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల అని ఆయన అఖిల్ తో సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలకు ఆయన పనిచేశాడని అఖిల్ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను uv క్రియేషన్స్ నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.