NTV Telugu Site icon

Akhil Akkineni: ‘ఏజెంట్’ సైలెన్స్ ‘వయోలెన్స్’ని డిఫైన్ చేస్తుంది…

Akhil

Akhil

అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్ మూవీ మేకర్స్, ఒక వైడ్ రైడ్ లాంటి మూవీ రాబోతుంది అనే హింట్ ఇచ్చేశారు. ఏజెంట్ కోసం కంప్లీట్ మేకోవర్ అయిన అఖిల్, లాంగ్ హెయిర్ అండ్ సిక్స్ ప్యాక్ తో రాక్ సాలిడ్ గా ఉన్నాడు. టీజర్ లో చూపించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ నుంచి పోస్టర్ డిజైన్ చేసి, దాన్ని మహాశివరాత్రి సంధర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. “అతని సైలెన్స్, వయోలెన్స్ ని డిఫైన్” అనే కొటేషన్ తో మేకర్స్ ఏజెంట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు #Agent అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

వైల్డ్ సాలాగా అఖిల్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. నిజానికి ఏజెంట్ మూవీ ఈ పాటికి విడుదలవ్వాల్సింది. ముందుగా ‘ఏజెంట్’ 2021 డిసెంబర్ 21న  ప్రేక్షకుల ముందుకి వస్తాడని అనౌన్స్ చేశారు కానీ ఈ డేట్ నుంచి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత గతేడాది ఆగస్ట్ 12ని రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యిందని మేకర్స్ ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. అనివార్య కారణాల వలన ఈ డేట్ ని కూడా ఏజెంట్ రిలీజ్ కాకపోవడంతో, మేకర్స్ ఫైనల్ గా 2023 ఏప్రిల్ 28ని లాక్ చేశారు. ఈ డేట్ కి అఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన లక్ ని టెస్ట్ చేసుకోబోతున్నాడు.

Show comments