Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్

Akhil

Akhil

అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈసారి ఎలాగైనా ‘లెనిన్’తో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా ఉన్నాడు. ఈనెల 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.  ఈ  నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు అఖిల్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అఖిల్  చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ అయ్యాయి. తన అన్న మాజీ భార్య సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ ..  నేను ఇంకా  ఆ సినిమా చూడలే, కానీ సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చూశాను. అందులో సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఆ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని నాకు అనిపించింది. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని అన్నాడు. అఖిల్ చేసిన ర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఫ్యామిలి నుండి వెళ్లిపోయిన కూడా అఖిల్ ఎంతో హుందాగా మాట్లాడడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న లెనిన్ ఎలాంటి వసూళ్లు రాబోదుతుందో చూడాలి.