NTV Telugu Site icon

Masooda: ఈమెనే ‘మసూద’ దెయ్యం…

Masooda Akhila Ram

Masooda Akhila Ram

హారర్ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సరైన హారర్ సినిమా చూసి చాలా కాలం అయ్యిందని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసిన ‘మసూద’ సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది. ‘ఆహా’ ప్లాట్ఫామ్ లో ఈ సినిమాని చూసిన వాళ్లు వణుకు పుట్టించే రేంజులో ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘మసూద’లో దెయ్యం ఫేస్ చూపించకుండానే భయపెట్టారు అంటూ కొందరు మాట్లాడుతుంటే, ఇంకొందరు మాత్రం అసలు ఈ మసూద క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు. సినిమాలో ఒక చోట, మసూద క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఫోటోని ఒక సీన్ లో చూపిస్తారు కానీ ప్రేక్షకులు ఆ ఫేస్ ని సరిగా చూసినట్లు లేరు. ఈ కారణంగానే “హూ ఈజ్ మసూద” అంటూ ఎంక్వయిరీలు చేస్తున్నారు.

Read Also: Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…

మొహం కూడా కనిపించకుండా, కేవలం తన బాడీ లాంగ్వేజ్ తోనే ఆడియన్స్ ని భయపెట్టిన ఆ అమ్మయి పేరు ‘అఖిలా రామ్’. ‘లిఫ్ట్ 8055’ అనే తెలుగు సినిమాలో డాక్టర్ గా అఖిలా రామ్ నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా MX ప్లేయర్ లో రిలీజ్ అవ్వడంతో చాలా మంది రీచ్ అవ్వలేకపోయింది. మరి ‘మసూద’ డైరెక్టర్ ‘సాయి కిరణ్’ అఖిలా రామ్ ని ఎక్కడ చూసాడో తెలియదు కానీ ఆమెని పెట్టి ప్రేక్షకులని అయితే భయపెట్టేసాడు. మసూద సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో కూడా అఖిలా రామ్ పాల్గోనింది. ఈ ఈవెంట్ లో కనిపించడమే కాకుండా అచ్చ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది కూడా. సోషల్ మీడియాలో ఎవరీ మసూద అనే చర్చ మొదలవ్వడంతో, ఈ మూవీ లవర్స్ అఖిలా రామ్ ఫోటోలని షేర్ చేస్తూ, ఈవిడే ఆవిడ అని రివీల్ చేస్తున్నారు. అఖిలా రామ్ ఒరిజినల్ ఫోటోలు చూసిన వాళ్లు దెయ్యం కూడా ఇంత అందంగా ఉందేంటి అని స్వీట్ షాక్ కి గురవుతున్నారు. మొదటి సినిమాతో ఆశించిన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ‘అఖిలా రామ్’ మసూద సినిమాతో హిట్ కొట్టింది కాబట్టి ఇకపై ఆమె కెరీర్ లో చేంజ్ కనిపిస్తుందేమో చూడాలి.

Read Also: Masooda: ఆర్జీవీ నీ పనికిమాలిన టైం మాకు ఇవ్వు…

Show comments