NTV Telugu Site icon

Akhil Akkineni : మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్న అఖిల్…?

Whatsapp Image 2023 06 27 At 9.24.33 Am

Whatsapp Image 2023 06 27 At 9.24.33 Am

అఖిల్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగార్జున వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.కానీ అతని సినీ కెరీర్ అంత ఊహించిన విధంగా అయితే సాగడం లేదు. అఖిల్ కు వరుస పరాజయాలు ఎదురవు తున్నాయి. రీసెంట్ గా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కనీసం పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించలేకపోయింది.ఏజెంట్ సినిమా ఫలితం తర్వాత అఖిల్ సినిమా కథల విషయంలో అలాగే బడ్జెట్ విషయంలో ఎంతో జాగ్రత్త పడతాడని అందరూ భావిస్తున్నారు.. అక్కినేని అభిమానులు కూడా అఖిల్ తరువాత సినిమా అయిన మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.. అఖిల్ తదుపరి సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

ఏజెంట్ సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.ఏజెంట్ సినిమా విషయంలో నిర్మాతల లెక్క తప్పినట్లు తెలుస్తుంది. అఖిల్ మార్కెట్ తెలుసుకోకుండా అంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించి నష్టాలు చవిచూసారు. కనుక అఖిల్ తో సినిమా ను చేసే యూవీ క్రియేషన్స్ వారు కూడా మినిమమ్ బడ్జెట్ లోనే సినిమా రూపొందిస్తే బాగుంటుందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యువీ క్రియేషన్స్ వారు అఖిల్ సినిమా కోసం రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. సినిమా కనుక విజయం సాధిస్తే పెట్టిన ఖర్చుకి రెట్టింపు వస్తుంది. కానీ సినిమా ఫలితం బాగోలేకపోతే యువీ క్రియేషన్స్ వారు అఖిల్ సినిమా వల్ల నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనీ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.యూవి క్రియేషన్స్ వారు అఖిల్ తో తెరకెక్కించే సినిమా లో కథ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అప్పుడే లాభాలు పొందగలమని భావిస్తున్నట్లు సమాచారం.

Show comments