Site icon NTV Telugu

అఖిల్ షాకింగ్ లుక్… ‘ఏజెంట్’ కోసం ఇంతలా మారిపోయాడా!!

Akhil

యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతో నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. తన తదుపరి చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కోసం అఖిల్ షాకింగ్ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిన విషయం తెలిసిందే. ‘ఏజెంట్’ షూటింగ్‌ను ప్రారంభించే ముందు తన లుక్స్ కోసం జిమ్ లో నెలల తరబడి కష్టపడ్డాడు. ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గూఢచారిగా నటిస్తున్నాడు. దానికి తగినట్లుగానే ఉన్న అఖిల్ కొత్త మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ ఇటీవలి లుక్‌లో తన బీస్ట్ లుక్ తో అందరినీ ఆకర్షించాడు. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో తన కండరపుష్టిని పిక్ లో చూపించాడు.

https://ntvtelugu.com/playback-singer-actor-manikka-vinayagam-passes-away/

తాజాగా మరోసారి తన సరికొత్త లుక్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బలమైన కండలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం అఖిల్ కు సంబంధించిన ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, సాక్షి వైద్య కథానాయిక. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి… అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ‘ఏజెంట్‌’లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version