Site icon NTV Telugu

Agent : మూవీ ప్లాప్.. రూపాయి తీసుకోని హీరో.. ఎవరంటే..?

Akhil

Akhil

Agent : ఈ రోజుల్లో సినిమాకు హీరోలు కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా ప్లాపా హిట్టా అనేది వారు పట్టించుకోరు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసేసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం మూవీ ప్లాప్ కావడంతో రూపాయి కూడా తీసుకోలేదంట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. అనిల్ సుంకర నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్. 2023 ఏప్రిల్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా నటించాడు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయింది. నిర్మాత చాలా నష్టపోయాడు.

Read Also : Sandeep Vanga : సందీప్ వంగాతో నాగ్ అశ్విన్ కు చిక్కులు.. ప్రభాస్ ఇప్పుడెలా..?

దీంతో హీరో అఖిల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదంట. మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని ముందే చెప్పాడంట అఖిల్. సినిమా ఆడకపోవడంతో రెమ్యునరేషన్ వద్దని చెప్పేశాడని నిర్మాత అనిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అఖిల్ కు రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటే తాను ఇంకా నష్టపోయి ఉండేవాడనని.. ఆ విషయంలో హీరోకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు నిర్మాత. అఖిల్ ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే తాను ప్రేమించిన జైనబ్ తో పెళ్లి చేసుకున్నాడు అఖిల్.

Read Also : Chiranjeevi : వాళ్లనే నమ్ముకుంటున్న చిరంజీవి.. రూటు మార్చేశాడా..?

Exit mobile version