NTV Telugu Site icon

Akhil Akkineni: అంత పెద్ద దెబ్బ తగిలినా రిస్క్ చేయడం ఆపట్లేదు…

Akhil

Akhil

ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథ కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా చూపించాడు. సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు, ప్రమోషన్స్ మొత్తం తనే ముందుండి నడిపించాడు. ఎన్ని చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఏజెంట్ సినిమాని రిజెక్ట్ చేసారు. సురేందర్ రెడ్డి మార్క్ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లాన్ మిస్ ఫైర్ అయ్యి అఖిల్ భారీ ఆశలపై ఏజెంట్ నీళ్లు చల్లింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

సోసియో ఫాంటసీ జానర్ లో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పుడే ఇవ్వకుండా షూటింగ్ స్టార్ట్ చేసే ముందు అనౌన్స్మెంట్ ఇచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లున్నారు. దాదాపు సమ్మర్ నుంచి అఖిల్ నెక్స్ట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. అయితే ఇప్పుడే ఈ మూవీ బడ్జట్ డీటెయిల్స్ బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారట యువీ క్రియేషన్స్. కొత్త దర్శకుడు అండ్ అఖిల్ మార్కెట్‌… ఈ రెండు విషయాలని పరిగణలోకి తీసుకుంటే అన్ని కోట్లు పెట్టడం భారీ రిస్క్ అనే చెప్పాలి కానీ అనిల్‌ కుమార్‌ చెప్పిన స్క్రిప్ట్‌ పై చాలా నమ్మకంతో యూవీ క్రియేషన్స్‌ అంత రిస్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారట. మరి అయ్యగారు ఈసారైనా పాన్ ఇండియా హిట్ కొడతాడేమో చూడాలి.

Show comments