NTV Telugu Site icon

Akhil Akkineni: మరోసారి ప్రేమలో పడ్డ అఖిల్.. అంతమాట అనేశాడేంటి..?

Akhil

Akhil

Akhil Akkineni: అక్కినేని నట వారసుడుగా అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా నుంచి నాలుగు సినిమా వరకు మనోడు ఆశించిన ఫలితాన్ని మాత్రం అనుకోలేకపోయాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అఖిల్.. ఏజెంట్ గా వస్తున్నాడు.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అఖిల్ సినిమాల విషయం పక్కన పెడితే.. అయ్యగారు ప్రస్తుతం సింగిల్ గా ఉన్నాడు. గతంలో అఖిల్ కు శ్రీయాభూపాల్ కు నిశ్చితార్థం జరిగి.. పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ జంట ప్రేమించుకొని ఇరు కుటుంబాల అంగీకారంతోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ఉంది అనగా తాము వీడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటినునుంచి అఖిల్ సింగిల్ గానే ఉంటున్నాడు.

Manchu Mohan Babu: చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడాడు. ” నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదు. నా పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, నేను సింగిల్ గానే ఉండాలనుకుంటున్నాను. మింగిల్ అయ్యే ఆలోచన కూడా నాకు లేదు. ఇప్పుడు నాకున్న లవ్ అంటే స్పోర్ట్స్ మాత్రమే. దాని ప్రేమలోనే ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో అదేంటీ బ్రో.. అంత మాట అనేశావ్..ప్రేమ, పెళ్లి వద్దు అంటే ఎలా..? చెప్పు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని తెలుస్తోంది. మరి ఈసారి ఏజెంట్ తో అయ్యగారు పాన్ ఇండియా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Show comments