Site icon NTV Telugu

అక్కినేని న్యూఇయర్ కిక్… తగ్గేదే లే అఖిల్ !

Akhil

అఖిల్ అక్కినేని తన కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి కోసం ‘ఏజెంట్’గా మారిన ఈ హీరో… ఆ సినిమా కోసం సరికొత్త ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారి అందరికీ షాకిచ్చాడు. ఇక తాజాగా న్యూఇయర్‌ సందర్భంగా మరోమారు తన తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అమ్మాయిలకు మన్మథుడిగా మారాడు. “కొత్త సంవత్సరం… కొత్త నేను. 2022లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. లెట్ యువర్ ఫైర్” అంటూ చొక్కా లేకుండా దిగిన పిక్ ను షేర్ చేశాడు. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు… ‘బంగార్రాజు’ టీజర్

ఈ పిక్ లో హాట్‌ నెస్‌ని ఇచ్చే వెట్ కర్ల్స్‌లో అఖిల్ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. కొంతమంది నెటిజన్లు అఖిల్‌ ని హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోమని కోరుతూ చిత్రంపై వ్యాఖ్యలు చేసారు. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ కోసం అఖిల్ హై-ఇంటెన్సిటీ కార్డియో, వెయిట్ లిఫ్టింగ్‌ వంటి విపరీతమైన వర్కౌట్స్ తో జిమ్ లో ఎంత కష్టపడ్డాడో ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది.

Exit mobile version