Akhil Akkineni: చైతన్య- శోభిత లవ్ ఎఫైర్.. అఖిల్ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. వారం నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. అందుకు కారణం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. అయితే మొదటి నుంచి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ .. ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అయినా పర్లేదు.. అఖిల్ ఉంటే .. అది పాన్ ఇండియా అయిపోతుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా అఖిల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలిచ్చాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ కు ఒక అనుకోని ప్రశ్న ఎదురయ్యింది. అఖిల్ అన్న నాగ చైతన్య- హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. లండన్ లో వీరిద్దరూ డేటింగ్ కు వెళ్లిన ఫోటో నెట్టింట లీక్ అయ్యి సంచలనం సృష్టించింది.
Ravanasura: వంద కోట్ల హీరో సినిమాకి పది కోట్లు నష్టమా?
Also Read
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
ఇక ఇదే విషయాన్ని ఒక రిపోర్టర్ అఖిల్ ముందు ఉంచాడు. ” మీ అన్నయ్య నాగ చైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు ఎవరో అమ్మాయితో కనిపించి మరి మీ పరిస్థితి ఏంటని” అడిగేశాడు. ఇక దానికి అఖిల్ విసుక్కోకుండా తాను ఏజెంట్ కోసం కష్టపడిన విధానాన్ని చెప్పుకొచ్చాడు. “నా పరిస్థితి ఏజెంట్ మూవీ.. దానికోసం నేను రెండేళ్లుగా ఈ బాడీ, హెయిర్ ను మెయింటైన్ చేయడతోనే సరిపోయింది. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!