Akhil’s Agent OTT release confusion: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా OTT విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత ఇంత ఘోరమైన రిజల్ట్ అందుకున్న తర్వాత కూడా, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. నిజానికి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోని క్రమంలో OTT రిలీజ్ చేయడం కోసం ఏజెంట్ సినిమాను మళ్లీ ఎడిటింగ్ చేసి సినిమాకి చెందిన ఒక కొత్త వెర్షన్ OTTలో స్ట్రీమ్ చేస్తారని ముందు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా మీడియా ఇంటరాక్షన్ లో క్లారిటీ ఇచ్చారు.
Ollulleru: 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మళయాల సాంగ్.. వింటే మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!
అనిల్ సుంకర మాట్లాడుతూ సోనీ లివ్ ఏజెంట్ సినిమాను ఎడిటింగ్ చేయడం లేదని, ఆ వార్తలు నిజం కాదని వెల్లడించారు. ఏజెంట్ సినిమా కంటెంట్ ఇప్పటికీ తమ వద్ద ఉందని అనిల్ సుంకర పేర్కొన్నారు, సోనీ లివ్ ఇంకా కంటెంట్ కోసం తమను అడగలేదని కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక అనిల్ సుంకర ప్రకటనతో, సోనీ లివ్ OTTతో చర్చలు వర్కవుట్ కాలేదని, ప్రస్తుతానికి అఖిల్ ఏజెంట్ ఇప్పట్లో OTTలో విడుదల చేయడం కష్టం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి ఏజెంట్ మూవీని సంయుక్తంగా నిర్మించగా, వక్కంతం వంశీ కథను అందించారు. హిప్ హాప్ తమీజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్‌గా నటించారు. ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసి ఆకట్టుకుంది.