Site icon NTV Telugu

Akhanda 2: ఈసారి సర్వేపల్లి సిస్టర్స్‌ని రంగంలోకి దించిన థమన్..

Akanda 2

Akanda 2

నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్‌బస్టర్‌లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మ్యూజిక్ కోసం థమన్ అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు శ్లోక పఠనంలో ఆరితేరిన వైదిక బ్రాహ్మణుల చేత కొన్ని శ్లోకాలు పాడించిన ఆయన, ఇప్పుడు ఒక సాంగ్‌ను సర్వేపల్లి సిస్టర్స్ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లతో పాడించినట్లు సమాచారం.

Also Read : Allu Sirish: అల్లూ శీరీష్ ఎంగేజ్ మెంట్ పై తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి, అయినది మరొకటి..?

వీరిద్దరూ చెన్నైలో సెటిల్ అయిన నెల్లూరుకు చెందిన తెలుగు కుటుంబం వారు. కర్ణాటిక్ సంగీతంలో ప్రవేశం ఉన్న వీరు ఇద్దరూ డాక్టర్లు అయినా సరే, సంగీతం మీద మమకారంతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పాటలు పాడి షేర్ చేస్తూ ఉంటారు. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వీరిద్దరి చేత ‘అఖండ 2’ సినిమాలో ఒక పాట పాడినట్లు అధికారికంగా థమన్ ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరితో కలిసి ఉన్న ఒక ఫోటోని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ‘అఖండ 2’ కోసం తమన్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనే భావన నందమూరి అభిమానులలో ఏర్పడుతోంది.

Exit mobile version