బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్స్ కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటిన్ నుండి పార్కింగ్ వరకు అందరు లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.
Also Read : Lokah : కేరళలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కొత్తలోక
ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నామని త్వరలో మరో డేట్ వస్తామని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి అన్నారు. రీసెంట్ గా జరిగిన NBK50 ఇయర్స్ వేడుకలో సరదాగా ముచ్చటిస్తూ ‘అఖండ్ 2 నీ కారణంగానే పోస్ట్ పోన్ అయింది తమన్. ఇది అసలు అన్ ఫైర్. దేవాన్ష్ అఖండ 2 కోసం ఎంతో ఎదురుచూశాడు కానీ ని వర్క్ కారణంగానే ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది’అని అన్నారు. ఈ సంబాషణలు తమన్ ను ఆటపట్టిస్తూ సరదాగా అన్నారు నారా బ్రాహ్మణి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా అఖండ 2 అనుకున్న డేట్ కు వస్తే బాగుండేది.
