Akhanda -2 : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో మూవీ అఖండ-2 తాండవం. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే వచ్చిన టీజర్ అంచనాలు అమాంతం పెంచేసింది. ఇందులో బాలయ్య నాగసాధుగా కనిపిస్తున్నారు. ఆయన లుక్ చాలా రియలస్టిక్ గా ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు జార్జియాలో షూట్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.
Read Also : Kantara Chapter 1 : ఆ వార్తలన్నీ ఫేక్.. స్పందించిన కాంతార టీమ్..
రామోజీ ఫిల్మ్ సిటీలో రేపటి నుంచి షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ కీలకమైన యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మూవీలోని నటీనటులతో పాటు యూనిట్ అందరూ పాల్గొంటున్నారు. మొదటి పార్టు మంచి హిట్ అవడంతో రెండో పార్టును అంతకు మించి యాక్షన్, డివోషన్ టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారు.
ఇందులో హిందూత్వం ఉట్టిపడేలా మూవీని తెరకెక్కిస్తున్నారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని కూడా చూపించబోతున్నట్టు సమాచారం. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కానుంది.
Read Also : Allu Arjun : ‘శక్తిమాన్’ గా బన్నీ.. అంతా ఉత్తదే..!
