Site icon NTV Telugu

Singer Sunitha: మా అమ్మ రెండో పెళ్లి.. మా నాన్నకు కూడా ఇష్టమే.. సునీత కొడుకు కీలక వ్యాఖ్యలు..

Sunitha

Sunitha

Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ ముహూర్తాన రెండో పెళ్లి గురించి అధికారికంగా చెప్పుకోచ్చిందో.. ఇప్పటివరకు కూడా ఆ పెళ్లి గురించి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. డబ్బు కోసం చేసుకుందని, ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ, వాటిని సునీత తనదైన మాట్లాతో కొట్టిపారేస్తూనే వచ్చింది. తన ఇద్దరు పిల్లలు తనకు అండగా ఉండి, దైర్యం చెప్పి.. ఈ పెళ్ళికి ఒప్పించారని చెప్పుకొచ్చింది. ఇక సునీత, రామ్ వీరపనేని పెళ్లి జరిగి రెండేళ్లు కావొస్తుంది. ఈ ఏడాది సునీత మొదటి భర్త కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లి సునీత రెండో పెళ్లి గురించి ఆకాష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” అమ్మ.. మమ్మల్ని పెంచడానికి ఎంతో కష్టపడింది. నేను చిరంజీవి గారి సినిమాలు చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో హీరో అవుతాను అంటే అమ్మ కాళ్ళు విరగ్గొడతాను అంది. అందుకే చదువు పూర్తీచేసి నటనలోకి దిగాను. అమ్మ రెండో పెళ్లి విషయంలో చాలా భయపడింది. నేను, చెల్లి ఒకటే అడిగాం.. నీకు ఆయనపై నమ్మకం ఉందా.. ? అని.. చాలా బాగా నమ్మకం ఉంది అని చెప్పింది. ఇక పెళ్లితరువాత రామ్ గారు కూడా అమ్మను చాలా బాగా చూసుకున్నారు. ఇక మా నాన్న ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటారు. మా నాన్న, రామ్ గారు మాట్లాడుకుంటారు. అమ్మ రెండో పెళ్లి చేసుకోవడం నాన్నకు కూడా ఇష్టమే. ఎన్నో ఏళ్లు అది లేదు.. మొత్తానికి అమ్మకు ఒక తోడు దొరికింది. తన సంతోషమే మాకు కావాల్సింది అదే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version