Site icon NTV Telugu

AK 64 : అజిత్ నెక్ట్స్ సినిమా.. మైత్రీ ఔట్.. వేల్స్ ఇన్

Ak64

Ak64

గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.   కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ అయ్యాడని తెలుస్తుంది.

Also Read : Thandel : బుల్లితెరపై తండేల్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే.?

అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కథ చర్చలు కూడా ముగిశాయని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ లో షూటింగ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అజిత్ తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఈ సినిమా కూడా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని మొదట్లో టాక్ వినిపించింది. మైత్రీ నిర్మాతలు కూడా అజిత్ కుమార్ తో మరో సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ అజిత్ 64ను మైత్రీ మూవీస్ చేయడం లేదు. ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది తమిళ బడా నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్. శింబు, జయం రవి వంటి హీరోలతో సినిమా చేసిన ఈ నిర్మాణ సంస్థ తొలిసారి అజిత్ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.త్వరలోనే అందుకు సంబందించిన అధికారక ప్రకటన రానుంది.

Exit mobile version